మొదటిసారి విడాకులపై స్పందించిన మెగాస్టార్ కూతురు.. నిజం చెప్పేసిందిగా?

praveen
మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ సినిమాలతో సాధించిన రికార్డులతో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయేది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడంతో వారి వారి సినిమాలు విడుదలై ఎప్పుడు మెగా ఫ్యామిలీ పేరు న్యూస్ లో కనిపిస్తూ ఉండేది. కానీ గత కొంతకాలం నుంచి సినిమాలతో కాకుండా మరో విషయంలో మాత్రం మెగా ఫ్యామిలీ పేరు వార్తల్లో కనిపిస్తూ ఉండడం చూస్తున్నాం. ఆ విషయం ఏంటో కాదు. మెగా ఫ్యామిలీలోని విడాకుల అంశం. మెగా డాక్టర్లు ఏకంగా విడాకులు తీసుకొని వేరుపడుతూ ఉన్నారు.

 మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికకు ఎంతో ఘనంగా పెళ్లి చేసిస్తే నిహారిక మాత్రం తన భర్త చైతన్య జొన్నలగడ్డకు ఇటీవల విడాకులు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భర్తకు.. విడాకులు ఇచ్చిన మెగాస్టార్ కూతురు శ్రీజ ఇక రెండో భర్త కళ్యాణ్ దేవ్ ని కూడా విడిచి పెట్టేందుకు సిద్ధమైంది. ఇలా విడాకుల అంశంతో మెగా ఫ్యామిలీ పేరు తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. అయితే ఇక రెండో భర్తకు విడాకులు ఇచ్చిన శ్రీజ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ దేవ్తో విడాకుల తర్వాత ఆమెను ఎంతో మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

 మెగా ఫ్యామిలీ లో జరిగే నెగిటివ్ థింగ్స్ అన్నింటికీ కూడా శ్రీజానే కారణం అంటూ విమర్శలు చేశారు. అయితే ఇప్పటివరకు శ్రీజ కళ్యాణ్ దేవ్ తో ఎందుకు విడిపోవలసి వచ్చింది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇటీవల ఈ విషయంపై స్పందించింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజ.. కళ్యాణ్ దేవ్తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్న విషయంపై ఓపెన్ అయింది. మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికి ప్రస్తుతం ఒంటరిగానే బ్రతుకుతున్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది నన్ను చాలా విధాలుగా మాట్లాడి బాధపెట్టారు. నా కుటుంబాన్ని బ్లేమ్ చేసీ దారుణంగా టోల్ చేశారు. అది చూసి ఎంతో ఏడ్చాను. మానసికంగా బాధపెట్టాను. ఎవరు విడాకులు తీసుకోవాలని.. పెళ్లి చేసుకోరు. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన ఇంట్లో అమ్మానాన్నల ఉండరు కదా.. అంత ప్రేమగా అసలు చూసుకోలేరు. మా నాన్న చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఆయనలా నన్ను ఎవరు చూసుకోలేరు అంటూ ఎమోషనల్ అయింది శ్రీజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: