ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని మంచి ఫాంలో ఉన్నాడు. TIER 2 హీరోల్లో టాప్ లో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఇక ఈ సినిమాల తరువాత నాని చేస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది.దసరా తర్వాత నాని చేస్తున్న రెండో పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' సినిమా పరాజయం పాలైంది. అయితే ఆ ఫలితం ఇప్పుడు ఈ సరిపోదా శనివారం మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు.సినిమా అంచనా బడ్జెట్ దాదాపు 80 కోట్ల రూపాయలు ఉంటుందట. ఈ సినిమా నిర్మాత దానయ్య భారీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో సేఫ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొనుగోలు చేయగా, శాటిలైట్ తో పాటు ఇతర హక్కుల చర్చలు కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ ని 45 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం తెలుస్తుంది. హాయ్ నాన్న ఓటిటిలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సరిపోదా శనివారంకి భారీ ధర దక్కింది.ఇక అలా ఈ సినిమా టోటల్ బిజినెస్ దాదాపు 100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. 2023లో దసరా, హాయ్ నాన్న వంటి విజయాలను అందుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఈ సినిమాతో 2024లో తన విజయాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు.ఇక సరిపోద శనివారం సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య భారీగా నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ఎస్‌జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్టుని నమోదు చేస్తుందో..