ఇన్నేళ్లకు.. అల్లు అర్జున్ అలాంటి రిస్క్ చేసేందుకు మళ్ళీ రెడీ అయ్యాడా?

praveen
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ లు కొట్టాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా అల్లు అర్జున్ కెరీర్ లో కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలలో బద్రీనాథ్ సినిమా కూడా ఒకటి. ఏకంగా ఈ మూవీపై అప్పట్లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టడం ఖాయమని అటు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కోసం బన్నీ కూడా బాగానే కష్టపడ్డాడు. ఏకంగా బాడీ పెంచి సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

 ఏకంగా దేవుడి సేవకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడు అల్లు అర్జున్. అయితే ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీ ఫలితం తర్వాత ఇలాంటి జానర్ సినిమాలను చేయడానికి అల్లు అర్జున్ పెద్దగా ధైర్యం చేయలేకపోయాడు. అయితే ఇక ఇప్పుడు అలాంటి కథాంశం తోనే పూర్తి డివోషనల్ టచ్ తో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇక అల్లు అర్జున్ తో మరోసారి డివోషనల్ టచ్ ఉన్న మూవీ ని తీయాలని అనుకుంటున్నాడట ఒక యంగ్ డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ విషయంపై అల్లు అర్జున్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.

 ఇప్పుడు అంతా ప్రేక్షకులు కాస్త డివోషనల్ టచ్ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సినిమా వస్తే సూపర్ హిట్ ఇచ్చేస్తున్నారు. హనుమాన్ సినిమా రిసల్ట్ ఇందుకు నిదర్శనం. దీంతో అల్లు అర్జున్ కూడా మరోసారి ఇలాంటి రిస్క్ తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇప్పటికే జరిగిపోయాయి. ఒకవేళ అల్లు అర్జున్ లాంటి డివోషనల్ టచ్ ఉన్న మూవీ ని ఒప్పుకున్న అది రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: