సాయిపల్లవి కంటే ముందు ఎందుకు చెల్లికి పెళ్లి చేశారు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్?

praveen
సాధారణంగా ఒక ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్లు గానీ ఉన్నారు అంటే ఇక పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకోవడం సహజం. అయితే ఇలా పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు మొదట ఎవరికి పెళ్లి చేస్తారు. ఇక ఇంట్లో అన్నదమ్ముల్లో పెద్దవాడైన యువకుడికి లేదంటే అక్క చెల్లెళ్లలో అక్కకి ముందుగా పెళ్లి చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు మాత్రం ఏకంగా పెద్దవారైనా అన్న, అక్కకు కాదని తమ్ముడు, చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక ఇటీవల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సాయి పల్లవి పేరెంట్స్ కూడా ఇలాంటిదే చేశారు. ఏకంగా అక్క అయిన సాయి పల్లవి నీ కాదని ఏకంగా ఇటీవలే సాయి పల్లవి చెల్లికి ముందే పెళ్లి చేసేసారు. దీంతో ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఎందుకు ఇలా సాయి పల్లవిని కాదని చెల్లికి ముందు పెళ్లి చేశారు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయంలో సాయి పల్లవి రిప్లై కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుండగా.. ఇలా తనను కాదనీ తన చెల్లికి ముందు పెళ్లి చేయడానికి గల కారణం ఏంటి అనే విషయంపై సాయి పల్లవి రియాక్ట్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 అయితే ఇది ఇప్పటి వీడియో కాదు ఒక త్రో బ్యాక్ వీడియో కావడం గమానార్హం. సాయి పల్లవి తన పెళ్లిపై ఏమి స్పందించారంటే.. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకే వివాహం చేసుకోవాలని అనుకున్న. అలాగే 30 ఏళ్లలో పిల్లలను కూడా కనెయ్యాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాపై కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దాంతో పెళ్లి వాయిదా వేసా. సినిమాలో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న అంటూ సాయి పల్లవి చెప్పింది. అయితే సినీ కెరియర్ కారణంగానే సాయి పల్లవికి కాకుండా ముందుగా ఆమె చెల్లికి పెళ్ళి చేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: