నాచురల్ స్టార్
నాని పోయిన సంవత్సరం మొదటగా
దసరా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా
దసరా మూవీ విజయంతో ఫుల్
జోష్ లో
నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ ని కూడా పోయిన సంవత్సరం
నాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విషయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం
నాని నటించిన రెండు
మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ నటుడు ఫుల్
జోష్ లో ఉన్నాడు.
ఇకపోతే ప్రస్తుతం
నాని ...
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే
సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ.కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఇప్పటికే అమ్మి వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారికి 45 కోట్ల భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అలాగే
నాని కెరియర్ లోనే హైయెస్ట్ ధరకు ఈ
సినిమా యొక్క డిజిటల్ హక్కులు అమ్ముడు పోయినట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.