హనుమాన్: 2 వారాలు దాటిన తగ్గని వసూళ్లు?

Purushottham Vinay
యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో జనవరి 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సినిమా హనుమాన్. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది. విడుదలైన రోజు నుంచి నేటి దాకా ఒక సెంటర్ అని కాదు అన్ని సెంటర్స్ లో కూడా ఫుల్ క్రౌడ్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా హనుమాన్ సినిమా సాధించిన కలెక్షన్స్ అందర్నీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హనుమాన్ సినిమా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఏకంగా 250 కోట్ల మైలురాయిని చేరుకుంది.నార్త్, ఏపీ, తెలంగాణ, ఓవర్ సీస్ ఏరియాల్లో 50 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ సినిమా ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించడం ఒక రికార్డ్ అని చెప్పాలి.ఇప్పటికి కూడా థియేటర్స్ దగ్గర హడావిడీ ఏమాత్రం తగ్గడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీస్ అందరు కలిసి హనుమాన్ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.


ఇంకా అంతటితో ఆగకుండా హనుమాన్ సినిమా చాలా బాగుందని తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. దీన్ని బట్టి హనుమాన్ ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో అర్ధం అవుతుంది.పైగా హనుమాన్ సినిమాని ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తే అయోధ్య రాముడికి అంత లాభం. ఎందుకంటే హనుమాన్ మూవీని వీక్షించే ప్రతి ప్రేక్షకుడు కొనే టికెట్ నుంచి 5 రూపాయిలు అయోధ్య రాముడి ఖాతాలోకి వెళ్తాయి. రీసెంట్ గా ఇప్పటి దాకా అలా వచ్చిన 2 కోట్ల రూపాయిలకి పైనే అయోధ్య రాముడికి వెళ్లాయి. ఒక్కటి మాత్రం నిజం హనుమాన్ మూవీని మేకర్స్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో గాని ఇప్పట్లో ఈ మూవీ కలెక్షన్ల ప్రవాహం మాత్రం తగ్గేలా లేదు.ఇలాగే ఇంకో వారం కంటిన్యూ అయితే ఈ సినిమా ఖచ్చితంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దాటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం. మరి చూడాలి ఈ సినిమా ఆ మార్క్ అందుకుంటుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: