టిల్లు స్క్వేర్: సమ్మర్ హీట్ మరింత పెరుగుతుంది?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన "డిజె టిల్లు" సినిమాతో "టిల్లు"గా యూత్ ని చాలా బాగా ఆకట్టుకున్నాడు. బ్లాక్‌బస్టర్‌ హిట్ గా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది.ఇక "టిల్లు స్క్వేర్" సీక్వెల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై "టిల్లు"గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయాన్ని రుజువు చేస్తూ, టిల్ స్క్వేర్ కోసం రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని "టికెట్టే కొనకుండా", "రాధిక" వంటి పాటలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యి చార్ట్‌బస్టర్‌ లుగా మారాయి. ఈ మూవీ మేకర్స్ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఒరిజినల్ కు మించిన ఎంటర్టైన్మెంట్ తో సీక్వెల్ చేయడానికి కావాల్సిన సమయం తీసుకున్నారు.అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఫిబ్రవరి 9న అనుకున్న విడుదల తేదీని వాయిదా వేయవలసి వచ్చింది.


ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు."డిజె టిల్లు" సినిమా కేవలం అభిమానులను మాత్రమే కాకుండా అందరు ప్రేక్షకులను అలరించింది."టిల్ స్క్వేర్"పై కూడా మేకర్స్  నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'టిల్లు ఫ్రాంచైజీ' నుంచి వస్తున్న మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె "కిల్లర్" హాట్ లుక్స్ యాత్ ని పిచ్చెక్కించి ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఆమె ఈ మూవీతో సమ్మర్ హీట్ ని మరింత పెంచడం ఖాయం.ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు.శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: