టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'గీతగోవిందం' సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 20 నాటికి పూర్తి కానుందని సమాచారం తెలిసింది. ఫిబ్రవరి నెలలో ఓ పాటను విడుదల చేసి ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అది కుదరకపోవడంతో మార్చి నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఫైనల్‌గా 'ఫ్యామిలీ స్టార్' సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5కు ఫిక్స్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అదే తేదీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' సినిమా విడుదల కావాల్సి ఉంది.
అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్ 5కి 'ఫ్యామిలీ స్టార్' సినిమాని రిలీజ్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.హీరో విజయ్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సీన్ తో పాటు మరికొన్ని పెండింగ్ సన్ని వేశాలు కూడా షూట్ చేయాల్సి ఉందట.అందువల్ల షూటింగ్ మొత్తం ఫిబ్రవరి 20 కల్లా పూర్తవుతుందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ 'సీతారా మం'..'హాయ్ నాన్న' వంటి విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' రూపంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఈ బ్యూటీ కెరీర్ లో తొలి హ్యాట్రిక్ నమోదైనట్లే.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..