చరణ్, తారక్, బన్నీ, ప్రభాస్ లాంటి హీరోలతో కాదు.. తృప్తికి ఆ హీరోతో సినిమా చేయాలని ఉందట?

praveen
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రావాలే కానీ ఓవర్ నైట్ లో స్టార్ గా మారవచ్చు అని చెబుతూ ఉంటారు. అయితే ఇక యానిమల్ సినిమాలో కీలకపాత్రలో నటించిన తృప్తి దిమ్రి విషయంలో కూడా ఇదే జరిగింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. అయితే ఈ మూవీలో ఒక కీలకపాత్రలో నటించింది తృప్తి. ఒకరకంగా చెప్పాలంటే అతిథి పాత్ర అంతమేరా ఆమె పాత్ర నిడివి ఉంది అని చెప్పాలి.

 అయితే సినిమాలో కనిపించింది కాసేపే అయినప్పటికీ ఆమె అందరిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దీంతో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా తృప్తి పేరు మారు మోగిపోయింది. యూత్ అందరూ కూడా ఈమె గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా బోల్డ్ పాత్రల్లో నటించి కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఓవర్ నైట్ లో తృప్తి దిమ్రి పేరు మారుమోగిపోయింది. అయితే ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట వరుసగా అవకాశాలు అందుకుంటుంది బడా హీరోల సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయి.

 అయితే టాలీవుడ్ లో కూడా ఎంతోమంది స్టార్స్ నుంచి ఛాన్సులు వస్తున్నాయి అని చెప్పాలి. కానీ తృప్తి మాత్రం చరణ్, తారక్, ప్రభాస్, బన్నీ లాంటి టాప్ హీరోలతో కాకుండా ఏకంగా మరో హీరోతో సినిమా చేయాలని ఉందట. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంతో మంది హీరోయిన్లకు సైతం క్రష్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఎంతో మంది స్టార్స్ సినిమాలో ఛాన్సులు వచ్చినా విజయ్ దేవరకొండ తో సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటే తృప్తి. అయితే కేవలం తృప్తి మాత్రమే కాదు గతంలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కూడా రౌడీ హీరోతో ఒక్క సినిమా చేయాలని ఉంది అంటూ పలు షోలలో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: