టాలీవుడ్ లో డైరెక్టర్ల మీద డిపెండ్ అవ్వని.. ఒకే ఒక్క హీరో ఆయనేనట?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఎక్కువగా కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. ఎందుకంటే కొత్త డైరెక్టర్లతో సినిమా చేస్తే అది రిస్క్ అవుతుందేమో అని భయపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి కథనైనా సరే స్టార్ డైరెక్టర్లు చేస్తేనే ఆ సినిమాలో నటించడానికి సిద్ధమవుతూ ఉంటారు.. ఇక ఆ కథను మొత్తం ఆ డైరెక్టర్ల చేతిలో పెడుతూ ఉంటారు. ఎందుకంటే డైరెక్టర్లు హీరోలను బాగా చూపిస్తూ ఉంటారు.

 డైరెక్టర్లపై ఆ మార్పు కావాలి ఈ మార్పు కావాలి అని ఒత్తిడి లేకుండా వాళ్ళు చెప్పింది చేయడం చేస్తూ ఉంటారు స్టార్ హీరోలు. కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోల్లో ఒక్క హీరో మాత్రం ఎక్కువగా దర్శకుల మీద డిపెండ్ అవ్వడట. దర్శకుడు ఎవరు అన్నది అసలు పట్టించుకోవడట. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా చేస్తుంది పెద్ద దర్శకుడు తోనా చిన్న దర్శకుడు తోనా అని అస్సలు పట్టించుకోడట  దర్శకత్వ ప్రతిభ ఉన్న ఎవ్వరైనా సరే మంచి కథతో వస్తే సినిమా చేయడానికి ఓకే చెప్పేస్తుంటారట పవన్ కళ్యాణ్.

 గతంలో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాల డైరెక్టర్లను చూస్తే ఇది అర్థమవుతుంది. డాలి అనే ఒక చిన్న సినిమాలు చేసుకునే డైరెక్టర్కు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ సాగర్ కే చంద్ర యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ ఇక ఆయన టేకింగ్ లో చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఇదే ప్లేస్ లో వేరే స్టార్ హీరోలు ఉంటే ఆ దర్శకుడిని ఒప్పించి మరి స్టార్ హీరోల చేతిలో ఆ కథ పెట్టి వారితో డైరెక్షన్ చేయించుకునే వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డైరెక్టర్ ని కాకుండా తనను తానే నమ్ముకుని ముందుకు వెళ్తాడు అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా అటు పవన్ కళ్యాణ్ మాత్రం తన నైజం మార్చుకోకుండానే ఇండస్ట్రీలో కేరియర్ కొనసాగిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: