టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో OG సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తోన్న సంగతి తెలిసిందే.RRR నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బాగా బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాత మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.అయితే ఈలోగా సుజిత్ నెక్స్ట్ మూవీ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఫిబ్రవరి నెలలో OG మూవీ కొత్త షెడ్యూల్ ని షూటింగ్ ఉండబోతోందని సమాచారం తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం లేదు. ఫిబ్రవరి నెల నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాల విస్తృత పర్యటనలు ఉన్నాయి. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది.ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ఎన్నికలపైనే ఉంది.ఇక OG మూవీ విషయానికి వస్తే ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని సుజిత్ డిజైన్ చేశాడట. అలాగే సినిమా ఎమోషనల్ బ్లాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని సమాచారం తెలుస్తోంది.
సాహో ప్లాప్ అయినా ఆ మూవీలో సుజిత్ యాక్షన్ ఘట్టాలు చాలా అద్భుతంగా తీశాడు. అయితే ఈ సినిమాలో ఎమోషన్ మిస్ అయ్యిందనే టాక్ ఎక్కువగా వచ్చింది.అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలలో ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అందుకే సుజీత్ OG కోసం కేవలం యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా హార్ట్ టచింగ్ హ్యూమన్ ఎమోషన్స్ ను సినిమాలో హైలెట్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఊచకోత కోయడమే కాకుండా మంచితనం కలిగి ఉంటుందంట.ఈ సినిమాలో నటిస్తోన్న శ్రియా రెడ్డి కూడా అద్భుతమైన స్క్రిప్ట్ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కి OGతో ఒక సాలిడ్ హిట్ ని సుజిత్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.