విశ్వక్ సేన్ తో సాంగ్.. ఆ హీరోయిన్ ఫేట్ మరుతుందా..?

shami
యువ హీరోల్లో మాస్ కా దాస్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదవారితో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అసలైతే 2023 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.

సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సాంగ్ లో ముందు కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ ని అనుకున్నారు కానీ మధ్యలో బాహుబలి భామ నోరా ఫతేహి ని కూడా తీసుకోవాలని అనుకున్నారు కానీ ఫైనల్ గా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి ఛాన్స్ ఇచ్చారు.

ఈషా రెబ్బ ఈమధ్య సినిమాలు తగ్గించినా వెబ్ సీరీస్ లతో అలరిస్తుంది. అయితే సినిమాల్లో ఎలాంటి ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తున్న ఈషా రెబ్బ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పింది. ఈ సాంగ్ తో అమ్మడు ఫేట్ ఏమన్నా మారుతుందేమో చూడాలి. ఈ సినిమాకు యువ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా తో విశ్వక్ సేన్ మరో డ్యాషింగ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. విశ్వక్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ తో ఈ సినిమా తప్పకుండా భారీ హైప్ తెచ్చుకునేలా ఉంది. ఈ సినిమాపై హీరోయిన్ నేహా శెట్టి కూడా చాలా హోప్స్ పెట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: