#DNS: ఆ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ.. అదుర్స్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఖాతాలో నా సామిరంగ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చి చేరింది. అక్టోబర్ నెలలో మొదలు పెట్టి నవంబర్, డిసెంబర్ లో సినిమా పూర్తి చేసి జనవరి సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. మినిమం 20 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయలేక అల్లాడుతున్న నాగార్జునకి ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా గ్రాస్ తెచ్చిపెట్టింది.ఈ సంక్రాంతి సీజన్ కి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాగార్జున.అందుకే నా సామిరంగ సినిమాను పొంగల్ నాడు రిలీజ్ చేశాడు.పోటీగా టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాలు ఉన్నా కానీ నా సామిరంగ సినిమా మీద నాగార్జున సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా ఫలితం నాగార్జున నమ్మకం నిలబెట్టేలా చేసింది.అలాగే ఈ సినిమా హిట్ నాగార్జునలో ఫుల్ జోష్ ని నింపింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తరువాతి సినిమా లైన్ లో పెట్టారు. నాగార్జున  నెక్స్ట్  ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.



కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాగార్జున. ఈ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. సునీల్ నారంగ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ధనుష్ నాగార్జున శేఖర్ కమ్ముల #DNS అంటూ సినిమా ఈమధ్యనే మొదలు పెట్టారు. అయితే నా సామిరంగ సినిమా తర్వాత నాగార్జున ఈ సినిమా చేయడం పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్ అని చెప్పొచ్చు.కొన్నాళ్లుగా కింగ్ నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు ఇవ్వలేదు. మధ్యలో బంగార్రాజు సినిమా పర్వాలేదు అనిపించినా నా సామిరంగ హిట్ నాగార్జునకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అందుకే ఇక మీదట తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించాలని డిసైడ్ అయ్యారు కింగ్ నాగార్జున. ఇక మీదట సినిమాల వేగం కూడా పెంచాలని  నిర్ణయించుకున్నారని సమాచారం తెలుస్తుంది. ఇక శేఖర్ కమ్ములతో చేసే ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం తెలుస్తుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: