మహేష్ రికార్డులకి హడలిపోతున్న మిగతా హీరోలు?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు
 రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ సినిమా ఏకంగా 231 కోట్ల గ్రాస్ వసూళ్లు, 130 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించి మహేష్ సత్తాని నిరూపించింది. నెగటివ్ టాక్ తోనే ఈ రేంజ్ వసూళ్లు అంటే అది మహేష్ బాబుకే సాధ్యం. దీంతో మహేష్ తన కెరీర్లో ఐదు 200 కోట్ల సినిమాలతో టాప్ లో దూసుకుపోతున్నాడు.ఇలా కేవలం రీజనల్ సినిమాలతోనే పైగా నెగటివ్ టాక్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేష్ ఇక రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ రికార్డులు షేక్ చెయ్యడం ఖాయం. మహేష్ రికార్డులు చూసి మిగతా స్టార్ హీరోలు వారి అభిమానులు వణికిపోతున్నారు. 
RRR సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఇది తమ హీరో మొదటి పాన్ ఇండియా సినిమా అని పైగా రాజమౌళి ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యడం చాలా బాగుందని చాలా సంతోషిస్తన్నారు.ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే SSMB29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.



గతంలోనే సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ లాగా ఉంటుందని, ప్రపంచదేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఓ సందర్భంలోఎస్ ఎస్ రాజమౌళి చెప్పారు. రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవలే ఈ సినిమా కథ పూర్తయింది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. అలాగే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని,మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని చెప్పాడు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్టే అని మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్లాడని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అవి నిజం కావు. మహేష్ బాబు తన డాక్టర్ ని కలవడానికి జర్మనీ వెళ్లారు. ఇక ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెడతారా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: