తమిళ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా కెప్టెన్ మిల్లర్. ఒక్క తెలుగు భాషలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.జస్ట్ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిన్న చిన్న లోపాలు ఉన్న ఓవరాల్ గా మూవీ చూడదగ్గ సినిమా అనిపించుకుంది.ఇదిలా ఉంటే జనవరి 25న కెప్టెన్ మిల్లర్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని తెలుగులో ప్రేక్షకులకి అందిస్తున్నాయి. సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలు రేసులో ఉండటంతో ఈ సినిమా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ పొంగల్ కానుకగా తమిళనాట రిలీజ్ కావడంతో అక్కడ వచ్చిన కొన్ని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లు తెలుగు వెర్షన్ లో లేకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్.తెలుగులో మూవీ నిడివిని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ 160 నిమిషాల నిడివి ఉంటే ఏకంగా 11 నిమిషాలు ట్రిమ్ చేసి 149 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజ్ చేస్తున్నారట.
తమిళ ఆడియన్స్ ల్యాగ్ వచ్చిందని కంప్లైంట్ చేసిన సన్నివేశాలని తొలగించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల సందడి ఎలాగూ ఈ వారం అయ్యాక తగ్గిపోతుంది. మళ్ళీ ఫిబ్రవరి 7 దాకా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు.ఈ టైంని కెప్టెన్ మిల్లర్ సినిమా ఏమైనా వినియోగించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా ధనుష్ సినిమాలకి తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. రఘువరన్ బీటెక్ సినిమా తర్వాత అతని సినిమాలు రెగ్యులర్ గా తెలుగులో డబ్ అవుతున్నాయి. సర్ సినిమాతో స్ట్రైట్ గా తెలుగు మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మిల్లర్ సినిమాకి మంచి ప్రాధాన్యత ఏర్పడింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ధనుష్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ధనుష్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ పాజిటివ్ వైబ్ కూడా కెప్టెన్ మిల్లర్ సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. మరి చూడాలి కెప్టెన్ మిల్లర్ హిట్ అవుతుందో లేదో..