టాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో నాగార్జునకి
సంక్రాంతి సెంటిమెంట్ భాగానే కలిసివచ్చింది. నిజానికి పెద్ద హీరోల సినిమాలు ఏవైనా సంక్రాంతికి రిలీజ్ అయితే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం
టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది.యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా
సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సంవత్సరం
సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో హనుమాన్ అయితే యునానమాస్ గా
సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో స్థానంలో మహేష్ గుంటూరు కారం నిలిచింది. కానీ వసూళ్ల పరంగా మాత్రం టాప్ లో ఉంది. ఇక నా సామి రంగాతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేటివిటీకి దగ్గరగా పల్లెటూరి జనానికి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో వచ్చిన
కింగ్ నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నిర్మాతకి కూడా మొదటి సినిమాతో సాలిడ్ హిట్ ని ఇచ్చారు.శ్రీనివాస
సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై
శ్రీనివాస్ చిట్టూరి మొదటి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. హాట్
బ్యూటీ సమంత
యూటర్న్ సినిమాతో
శ్రీనివాస్ చిట్టూరి
ప్రొడ్యూసర్ గా మారారు.అయితే ఆ
సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఆ తరువాత ఊర్వశీరౌతేలాతో బ్లాక్ రోజ్ అనే
మూవీ స్టార్ట్ చేశారు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక సిటీమార్ మూవీతో సోలో
ప్రొడ్యూసర్ గా
జర్నీ స్టార్ట్ అయ్యింది.అయితే ఈ
సినిమా ఎవరేజ్ గా నిలిచింది.తరువాత
రామ్ పోతినేనితో ది
వారియర్ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించి డిజాస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో ఆయన బాగా లాస్ అయ్యారు. ఆ తరువాత
నాగ చైతన్యతో చేసిన కస్టడీ
మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక బోయపాటి,
రామ్ కాంబోలో చేసిన స్కంద
మూవీ అయితే ఎన్నో భారీ నష్టాలు మిగిల్చింది. ఇలాంటి పరిస్థితిలో
కింగ్ నాగార్జునతో మలయాళీ
రీమేక్ గా నా సామి రంగా సినిమాని చేశారు.ఎట్టకేలకు ఈ
సినిమా అతనికి సాలిడ్ హిట్ ని అందించింది అని చెప్పాలి. ఈరోజు బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ
సినిమా ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతోంది. ఈ
సినిమా ప్రమోషన్స్,
మార్కెట్ అన్ని విషయాలలో కూడా
నాగార్జున దగ్గరుండి చూసుకొని నిర్మాతకి మంచి లాభాలు వచ్చేలా చేశారు. నిర్మాతగా
జర్నీ స్టార్ట్ చేసిన 6 ఏళ్ళ తర్వాత
శ్రీనివాస్ చిట్టూరి మొదటి హిట్ ని అందుకున్నారు. ఈ
సినిమా 35 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు 17 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించి వారం రోజుల్లోనే క్లీన్ హిట్టుగా నిలిచింది.