కొడుకు ముంచితే నాన్న ఆదుకున్నాడు :: శ్రీనివాస చిట్టూరి

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తున్న నిర్మాతల లో శ్రీనివాస చిట్టూరి ఒకరు. యూటర్న్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ నిర్మాత ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత సీటీమార్, ది వారియర్, కస్టడీ, స్కంద సినిమా లను నిర్మించిన ఈ నిర్మాతకు ఈ సినిమా లన్నీ భారీ షాకులిచ్చాయి. అయితే నా సామిరంగ రూపంలో శ్రీనివాస చిట్టూరికి భారీ లాభాలొచ్చాయి.నా సామిరంగ మూవీ ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. నాగచైతన్య కస్టడీ సినిమాతో ఈ నిర్మాత ను ముంచేయగా నాగార్జున మాత్రం నా సామిరంగ సినిమాతో భారీ లాభాలను అందించారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ నిర్మాతకు సక్సెస్ దక్కడంతో సినీ అభిమానులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

నా సామిరంగ సినిమాకు ఇప్పటివరకు 20.54 షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఏడో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే కోటీ 11 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. వైజాగ్, సీడెడ్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నా సామిరంగ సినిమాకు ఇప్పటివరకు 41.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల మార్క్ ను దాటే ఛాన్స్ ఉంది. శ్రీనివాస చిట్టూరి ఇకపై పరిమిత బడ్జెట్ తో, మంచి కంటెంట్ తో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగ్ శ్రీనివాస్ చిట్టూరి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి మిడ్ రేంజ్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీనివాస చిట్టూరికి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: