ఆ హీరోకి వీరాభిమానిని.. మహేష్ బాబు హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఏకంగా స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగుతూ ఉంది మీనాక్షి చౌదరి. తన అందం అభినయంతో ఇప్పటికే ప్రేక్షకులను కట్టిపడేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోను హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీలో ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా మహేష్ బాబు మరదలు పాత్రలో నటించింది మీనాక్షి చౌదరి.

 ఇక మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్గా యంగ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా నటించడం గమనార్హం. కాగా త్రివిక్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే అటు మధ్యలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఇక ఈ సినిమా వసూళ్లు మాత్రం భారీ రేంజ్ లోనే వచ్చాయి అని చెప్పాలి. ఇక కావాలనే ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారంటూ అటు మేకర్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ బాబు హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

 గుంటూరు కారం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ హీరో విజయ్ సరసన  ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అంటూ మీనాక్షి చౌదరి తెలిపింది. అయితే దళపతి విజయ్ కి తాను వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఆయన యాక్టింగ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన షూటింగ్లో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు అంటూ మీనాక్షి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: