సినీ పరిశ్రమపై పొలిటికల్గా సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే చాలామంది భయపడుతూ ఉంటారని టాక్ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కు సూటిగానే తెలియజేస్తారని తనకన్నా పెద్దవారైనా చిన్నవారైనా సరే ఏమనిపిస్తే అది తెలియజేస్తూ ఉంటారని చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అందుకే చాలా సందర్భాల్లో మోహన్ బాబు గారు చేసిన వాక్యాలు సైతం వివాదాలకు దారి తీసేలా కనిపిస్తూ ఉంటాయి.ఇప్పుడు తాజాగా ఈయన కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


రీసెంట్గా మోహన్ బాబు ఫిలిం నగర్ లో టెంపుల్ చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈనెల 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఫిలింనగర్ టెంపుల్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.. జనవరి 14 నుంచి 22 వరకు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు సినీ పరిశ్రమకు ఏం చేసిన అది కాంగ్రెస్ పార్టీ నే ఇచ్చిందని ఫిలింనగర్ దైవ సన్నిధి దానం అలా కట్టినదే అంటూ తెలియజేశారు. అలాగే చిత్రపురి కాలనీ కూడా అలాగే వచ్చిందంటూ తెలిపారు.


ఈ గుడిలో 18 ముహూర్తాలు 15 మంది బ్రహ్మోత్సవములు ఉన్నారని ఈ దైవ సన్నిధిలో కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని తెలిపారు తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీరాముడు, లక్ష్మీనరసింహస్వామి ఇలా 18 దేవతలు ఈ గుడిలో కొలువై ఉన్నారంటూ తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందుకు భక్తులంతా పాల్గొనాలంటే తెలిపారు.. అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం అందిందని కాకపోతే కొన్ని కారణాల చేత వెళ్లలేకపోయాను అంటూ కూడా మోహన్ బాబు వెల్లడించారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: