వామ్మో: భర్తను దూరం పెడుతున్న నయనతార.. కారణం..?

Divya
కోలీవుడ్ టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన నయనతార ఆమె భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ కు ప్రస్తుతం టైమ్ అసలు బాగాలేదని తెలుస్తోంది. కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా తర్వాత విజ్ఞేష్ ఇప్పటివరకు మరో సినిమాని ప్రకటించలేదు.ఆమధ్య అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు అయితే ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కోసం చాలా వేచి ఉంచారు. చివరి క్షణంలో ఆ సినిమా కూడా చేజారిపోయినట్లు తెలుస్తోంది.


ఇటీవలే లవ్ టు డే చిత్రం ఫ్రేమ్ ప్రదీప్ రంగనాథ్ తో ఒక సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు.ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేశారు.. ఇందులో హీరోకి అక్కగా నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పైన లలిత్ కుమార్ నిర్మిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి సినిమా టైటిల్ చిక్కుల్లో పడిన సంగతి అందరికీ తెలిసినదే..LIC సంస్థ తమ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిన ఈ టైటిల్ చిత్రానికి ఉపయోగించకూడదంటూ నిర్మాతకు సైతం జారీ చేశారు.


దీంతో డైరెక్టర్ విగ్నేష్ ఈ చిత్ర టైటిల్ని మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక నయనతార విషయానికి వస్తే ఈమె నటించిన 75వ సినిమా అన్నపూరణి సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు ఈమె పైన కేసులు కూడా నమోదయ్యాయి ఇవన్నీ ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ నయనతార తన భర్త విగ్నేష్ డైరెక్షన్లో ఎల్ఐసి సినిమా నుంచి వైదొలగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమంటూ నిర్మాతలు చెప్పడంతో ఈ చిత్రం నుంచి నయనతార దూరం ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  బర్త డైరెక్షన్ సినిమా అయినా సరే నో చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: