అంతర్మధనంలో డబల్ ఇస్మార్ట్ !
సినిమాలను చాలవేగంగా తీసే పూరీ తన తీరుకు భిన్నంగా ఈసినిమాను చాల స్లోగా తీస్తున్నాడు. ఈసినిమా విడుదల తేదీని మార్చి 8కి లాక్ చేస్తూ చాలకాలం క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈసినిమా అనుకున్న ఈతేదీకి విడుదల అవ్వడం కష్టం అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనికికారణం ఈసినిమాకు సంబంధించి ఇంకా 30 రోజుల వర్క్ మిగిలి ఉంది అంటున్నారు. హడావిడి పడుతూ ఖంగారుగా ఈషూటింగ్ ను పూర్తి చేయడం అటు పూరీకి కాని ఇటు రామ్ కు కానీ ఇష్టం లేకపోవడంతో ఈమూవీ సమ్మర్ రేస్ కు వాయిదా పడుతుంది అన్న లీకులు వస్తున్నాయి.
దీనికితోడు ప్రస్తుతం ఈమూవీ పై క్రేజ్ అంతంత మాత్రంగా ఉండటంతో బయ్యర్ల నుండి కూడ స్పందన పూరీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈసినిమాను మార్కెట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటించిన ‘స్కంద’ భయకరమైన ఫ్లాప్ గా మారడంతో రామ్ కు కూడ ‘డబల్ ఇస్మార్ట్’ అత్యంత కీలకంగా మారింది.
అయితే రాబోతున్న సమ్మర్ రేస్ కు విడుదల అవ్వడానికి అనేక సినిమాలు పోటీపడుతున్న పరిస్థితులలో పోరీ కోరుకున్న విధంగా తన ‘డబల్ ఇస్మార్ట్’ కు ఎటువంటి పోటీ లేని డేట్ దొరకడం కష్టం అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీ వాయిదా పడితే మార్చి 8వ తేదీనే నమ్ముకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు మంచి అదృష్టం కలిగినట్లే అనుకోవాలి..