బంగార్రాజు 3 ఆలోచనలలో నాగార్జున !

Seetha Sailaja
సంక్రాంతి రేస్ కు విడుదలైన సినిమాలలో ‘హనుమాన్’ తరువాత ఒక వారం పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ కు వచ్చిన మూవీగా నాగార్జున ‘నాసామిరంగ’ రికార్డ్ క్రియేట్ చేసింది. వాస్తవానికి ఈసినిమా పై చెప్పుకోతగ్గ పాజిటివ్ టాక్ రానప్పటికీ ఈ సినిమాను చూసి వచ్చిన సగటు ప్రేక్షకుడు ఏవరేజ్ అని చెపుతూ ఉండటంతో ఈమూవీకి కలక్షన్స్ విషయంలో చాల సులువుగా పాస్ మార్కులు పడ్డాయి.

ఈసినిమా బిజినెస్ కూడ సుమారు 35 కోట్ల రేంజ్ లో జరగడంతో ఈమూవీకి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ సంక్రాంతి రేస్ లో సక్సస్ విషయంలో 2వ స్థానంలో నిలిచింది అని అంటున్నారు. దీనితో ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీ తరువాత నాగార్జునకు చాల సంవత్సరాలు తరువాత హిట్ ఇచ్చిన మూవీగా ‘నాసామీరంగ’ రికార్డు క్రియేట్ చేయడంతో ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ జోష్ లో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

గత కొంత కాలంగా వరస ఫ్లాప్ లు వెంటాడుతూ ఉండటంతో ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న నాగార్జునకు ఈ మూవీ సక్సస్ ఒక మార్గాన్ని చూపెట్టింది అని అంటున్నారు. నాగ్ కు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ ను రిపీట్ చేయడానికి వచ్చే సంవత్సరం కూడ తన వైపు నుండి ఒక సినిమా ఉండేల ప్లాన్ చేసుకోవాలని నాగ్ ఇప్పటి నుండే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య తనతో ఇప్పటికే ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘బంగార్రాజు’ లాంటి హిట్ సినిమాలను ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన ‘బంగార్రాజు 3’ సీక్వెల్ ఆలోచనలకు స్క్రిప్ట్ తయారు చేయమని నాగార్జున ఆదర్శకుడుకి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిరంజీవి కూతురు సుస్మిత చిరంజీవితో నిర్మించాలి అనుకున్న భారీ బడ్జెట్ మూవీకి స్క్రిప్ట్ ను రెడీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో కళ్యాణ్ కృష్ణ నాగ్ ల కాంబినేషన్ సెట్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: