కొత్త ప్రపంచంలోకి మెగాస్టార్.. అలాంటి కథ కోసం వెయిటింగ్?

praveen
దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఇక వరుస సినిమాను చేస్తూ ఉన్నారు. అయితే మధ్యలో రాజకీయాలు అంటూ పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. వాల్తేరు వీరయ్య అనే సినిమాకి గత ఏడాది  సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు ఇక ఇప్పుడు ఒక సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నాడు .

 చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి కెరీర్ లో ఇలాంటి మూవీ తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఇక బింబిసారా  సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించబోతున్నాడు అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ లాంటి హీరోని ఏకంగా ఒక అద్భుతంగా చూపించాడు వశిష్ట  ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడో అనేదానిపై అంచనాల పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత కూడా నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టేసారు. కాగా ఇక ఇప్పుడు చిరంజీవి ఏకంగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఆ కొత్త ప్రపంచం ఏదో కాదు ఓటీటి ప్రపంచం. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న అందరూ కూడా ఓటీటిలో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ.. ఇక తమలోని కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే  ఎవరైనా డైరెక్టర్ బలమైన కథలను తీసుకువస్తే.. ఓకే చెప్పేందుకు రెడీ అవుతున్నారట. మరి చిరంజీవి ఓటిటి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: