చిరు డైరెక్టర్ తో చరణ్ మూవీ.. అసలు విషయం చెప్పేసాడుగా?

praveen
టాలెంట్ గా ఉండాలి కానీ ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటూ ఉంటారు ఎంతోమంది. అయితే ఇది నిజమే అని నిరూపిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారిలో బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట మళ్లీడి కూడా ఒకరు అని చెప్పాలి. అప్పటివరకు అతను ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో సినిమా చేసి సాహసమే చేశాడు వశిష్ట. కానీ ఇక సినిమా విడుదలైన తర్వాత తెలిసింది అతని సత్తా ఏమిటో అని. ఏకంగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ ఇచ్చాడు వశిష్ట.

 టైం ట్రావెల్ అనే కథాంశంతో ఒక రిస్కీ కాన్సెప్ట్ ని తీసుకొని ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే  ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెగాస్టార్ తో విశ్వంభరా అనే ఒక సోషియో ఫాంటసీ సినిమాను చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులు అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీపై అంచనాలను పెంచేసింది అని చెప్పాలి.

 డైరెక్టర్ వశిష్ట గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న డైరెక్టర్ వశిష్ట ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త తెర మీదకి వచ్చింది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ట. నేను రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాను అన్నది కేవలం కల్పిత వార్త మాత్రమే. నేను చిరంజీవి గారితో జగదేకవీరుడు అతిలోకసుందరి తరహా సినిమా చేయాలని ఉంది అని మాత్రమే అన్నాను. దానిని చరణ్తో సినిమా అన్నట్లుగా సృష్టించారు. నేను ఎక్కడ చరణ్ తో ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పలేదు  నాకు ఫాంటసీ కథలు అంటే ఇష్టం ఇదే చెప్పాను. మరొకటి చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: