ఇండియాని షేక్ చేస్తున్న దేవుడి సినిమాలు?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇంకా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన 'హనుమాన్' సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11 న వేసిన ప్రీమియర్ షోలతో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.ఆల్రెడీ రూ.100 కోట్ల గ్రాస్ ను అధిగమించిన ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ కి కూడా ఈ సినిమా దగ్గరవుతుంది.ముఖ్యంగా ఓవర్సీస్ లో  ఈ మూవీ అద్భుతంగా కలెక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే..‘హనుమాన్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి ఏకంగా రూ.74.08 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.46 కోట్ల లాభాలను అందించింది. ఇక గ్రాస్ పరంగా ఈ సినిమా 120 కోట్ల దాకా వసూలు చేసింది.



ఈ సినిమా ఇంత పెద్ద హిట్టు కావడానికి కారణం హనుమాన్ దేవుడు.ప్రస్తుతం దేవుడి సెంటిమెంట్ తో వచ్చే పాన్ ఇండియా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో కృష్ణుడి నేపథ్యంలో కార్తికేయ సినిమా వచ్చి ఏకంగా 122 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే కన్నడ నుంచి చిన్న సినిమా కాంతార అక్కడి గ్రామ దేవుడు గులిగా నేపథ్యంలో వచ్చి ఆల్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 450 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కన్నడలో kgf 2 రికార్డులని దాటి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అలాగే రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన మంగళవారం సినిమా కూడా దేవుడి నేపథ్యం ఉన్న సినిమా.ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడానికి కారణం నార్త్ మార్కెట్ లో హిట్ అవ్వడమే. దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు కావడం వల్ల దేశావ్యాప్తంగా రికార్డ్ వసూళ్లు సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: