చిరంజీవి బెంగళూరు ఫామ్ హౌస్ గురించి ఆసక్తికరమైన వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే ఈయన కుటుంబం నుండి ఇప్పటికే అనేక మంది హీరో లు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే వీరి ఫ్యామిలీ నుండి కొంత మంది మహిళలు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనితో మెగా ఫ్యామిలీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే వీరు తమ పర్సనల్ పనుల వల్ల ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏదైనా పండగ వచ్చింది అంటే అంతా ఒక చోట చేరి ఆ పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు.


 అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇతర ప్లాట్ ఫామ్ ల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా మెగా కుటుంబం సభ్యులు సంక్రాంతి వేడుకలను బెంగళూరు లో జరుపుకున్నారు. బెంగళూరు లో వీరంతా ఒక ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. దానితో ప్రస్తుతం ఆ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


 ఇకపోతే మెగా కుటుంబం సంక్రాంతి జరుపుకున్న ఆ ఫామ్ హౌస్ ఎవరిది ..? అది బెంగుళూరు లో ఏ ప్రదేశం లో ఉంది ..?  అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం. తాజాగా మెగా కుటుంబం సంక్రాంతి సంబరాలను జరుపుకున్న ఫామ్‌ హజ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ది. అది బెంగళూరు నగరానికి దాదాపుగా 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. ఈ ఫామ్‌ హౌజ్‌ కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా చాలా దగ్గర్లోనే ఉంటుంది. అయితే ఈ ఫామ్ హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే  ఉండవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: