టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బిజియేస్ట్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు అయినటువంటి రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేయలేక అపజయం పాలయ్యింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ సంస్థ వారు తెలుగు , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అల్లరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.