ఏంటి.. కీరవాణి కంటే.. హీరో నాగార్జున వయస్సులో పెద్దోడా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అక్కినేని నాగార్జున. అయితే నాగార్జునను చూస్తే మాత్రం నిజంగా ఈయన సీనియర్ హీరోనేనా లేకపోతే ఇక కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే హీరోనా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక ఆయన అలా ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇండస్ట్రీలో నాగార్జునకి మన్మధుడు అని పేరు ఉంది. ఇక ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ఫిట్నెస్ గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా అమ్మాయిల కలల రాకుమారుడు గానే కొనసాగుతూ ఉన్నాడు నాగార్జున.

 ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న ఎందుకో నాగార్జున అంటే పడి చచ్చిపోయే అమ్మాయిలు ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే నాగార్జున ఇటీవల సంక్రాంతికి నా సామిరంగా అని సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నాగార్జున గురించి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు. మీరు నాకన్నా వయసులో పెద్ద కదా.. కానీ నేను మీకంటే పెద్దగా కనిపిస్తున్న కదా అంటూ కీరవాణి షాకింగ్ విషయం రివీల్ చేశారు. మీలాగా హెల్త్ అండ్ ఫిట్నెస్ గా ఉండాలంటే ఏం చేయాలి అంటూ ప్రశ్నించాడు కీరవాణి.

 ఇక తర్వాత మాట్లాడిన నాగార్జున.. తాను కీరవాణి కంటే పెద్దవాడిని అని ఒప్పుకున్నాడు. తన డైట్ సీక్రెట్ ని పంచుకున్నారు. కష్టపడినంత మాత్రాన ఫిట్గా ఉంటామనేది నిజం కాదు. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ రాదు. నేను చక్కగా డిన్నర్ చేస్తాను.. బ్రౌన్ రైస్ తింటాను.. చికెన్ తింటాను.. ఫిష్ తింటాను.. నెయ్యి తింటాను. భోజనం చేసే ప్రతిసారి మూడు ఆకుకూరలు తింటాను. పచ్చళ్ళు తింటాను రోజు రెండు రౌండ్లు మద్యం తాగుతాను. స్వీట్స్ తినకుండా నిద్ర పట్టదు. ఫిట్నెస్ కోసం కడుపు మాత్రం మార్చుకోను. అన్ని రకాల ఫుడ్స్ తీసుకున్న కచ్చితంగా వర్కౌట్స్ చేస్తాను  తినే క్యాలరీస్ బర్న్ అయ్యేలా ఎక్సర్సైజ్ చేస్తాను. హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇలా వే ఆఫ్ లివింగ్ తోనే ఫిట్నెస్ అనేది వస్తోంది అని నేను భావిస్తాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే ఇక నుంచి నేను కూడా దీని విషయంలో ఎంతో జాగ్రత్తగా తీసుకుంటాను అంటూ కీరవాణి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: