డాన్స్ లో నా గురువు బాలయ్యే.. కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఎంత దూకుడు మీద ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలు సాధిస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా తన ఎనర్జీతో అందరిని ఆశ్చర్యపరిస్తూనే ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఆహా ఓటీపీ వేదిక అన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో కూడా చేస్తూ ప్రేక్షకులు అందరినీ కూడా మరింతగా అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే కెరియర్ మొదటి నుంచి మాత్రమే కాదు ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న కూడా సీనియర్ హీరో బాలయ్య తన డాన్సులతో ఇరగదీస్తూ ఉంటాడు. అయితే బాలయ్యకు డాన్స్ రాదు. బలవంతంగా చేస్తాడు అని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కానీ బాలయ్య ఇవేవీ పట్టించుకోకుండా డాన్సులు చేస్తూనే ఉన్నాడు. అయితే బాలయ్య ఎంతసేపైనా డాన్స్ చేస్తాడని.. ఆయన పక్కనున్న వారు అలసిపోతారు తప్ప ఆయనకు మాత్రం అలుపు రాదు అంటూ గతంలో ఆయనతో కలిసి నటించిన ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా పలుమార్లు కామెంట్ చేసింది..
 అయితే కొన్ని కొన్ని సార్లు ఆయన డాన్స్ చూస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా ఇదే అనిపిస్తూ ఉంటుంది. అయితే బాలయ్య డాన్స్ లో తన గురువు అంటూ చెబుతుంది ఒక బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు కత్రినా కైఫ్. బాలయ్య సరసన అల్లరి పిడుగు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది కత్రినా కైఫ్. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పాలి. అయితే అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు బాలయ్య దగ్గరుండి డాన్స్ ఎలా చేయాలో నేర్పించారు . డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకే. నా డాన్స్ విషయంలో ఎప్పటికీ నా గురువు బాలయ్య అని అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కత్రినా కైఫ్. ఈ బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: