ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి భారీ ఇప్పటికే 4 సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే ఇప్పటికే ఆ నాలుగు సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో టికెట్ లు బుకింగ్ అవుతూ ఉండగా ... మరికొన్ని సినిమాలకు పర్వాలేదు అనే స్థాయిలో టికెట్ లు బుక్ అవుతున్నాయి. అందులో భాగంగా ఏ సినిమాకు ఆఖరి 24 గంటల్లో ఏ రేంజ్ లో టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యింది. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన 115.43 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యింది. ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 253.07 కే టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయాయి.
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యింది. 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 33.35 కే టికెట్లు బుక్ మై షో లో అమ్మడు పోయాయి.
నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లు 24 గంటల్లో బుక్ మై షో లో 65.73 కే అమ్ముడుపోయాయి.