Ott: కన్నడ నుంచి మరో బ్లాక్ బస్టర్ కాటేరా మూవీ ఓటిటి..!!
ముఖ్యంగా సలార్ సినిమాకి పోటీగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాటేరా.. ఈ చిత్రాన్ని కన్నడ హీరో దర్శన్ నటించారు. ఈ సినిమా గత నెల డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలై భారీ రెస్పాన్స్ లభించింది. ముందుగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల చేయాలనుకున్నారట. కానీ సలార్ సినిమా బరిలో ఉండడంతో కేవలం కన్నడలో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.విడుదలైన 18 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆన్నోచోట్ల ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోతుంది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే అది థియేటర్లోన,ఓటీటి లోన అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీన zee -5 లో అన్ని భాషలలో స్ట్రిమ్మింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పైన క్లారిటీ రాలేదు.. లేదంటే జనవరి 26న తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.1970 బ్యాగ్రౌండ్ లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రంనికీ తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. రూ .45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ .105 కోట్లను రాబట్టింది.