హిట్టిచ్చే హీరోయిన్ కోసం.. టాలీవుడ్ లో ఎదురుచూపులు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువ అనీ సిని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగడమే ఎక్కువ. ఇక అంతకుమించి ఎవరైనా స్టార్గా హవా నడిపించారు అంటే చాలు అంతకు మించిన హీరోయిన్లు మరొకరు లేరు అని చెబుతూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉంటారు. కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఇంకొంతమంది మాత్రం వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ ఇండస్ట్రీలో పాతుకు పోతూ ఉంటారు.

 స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించి ఇక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎవరైనా హీరోయిన్ వరుసగా హిట్లు కొట్టింది అంటే చాలు లక్కీ హీరోయిన్ అని ఒక ట్యాగ్ ను ఇచ్చేస్తూ ఉంటారు. అదే హీరోయిన్ వరుసగా రెండు మూడు ఫ్లాపులు కొట్టిందంటే ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్ల విషయంలో ఇది జరిగింది  అయితే గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయిన హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల అని చెప్పాలి.

 ఇక పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొట్టింది. అయితే గత కొంతకాలం నుంచి ఈ అమ్మడికి అసలు కలిసి రావట్లేదు  ఇక వరుస ప్లాపులతో డీల పడిపోతుంది శ్రీలీల. ఇక మరోవైపు సీనియర్లు అనుష్క, కాజల్, తమన్నా, సమంత, నాయనతార, రకుల్ అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. పూజ హెగ్డే,  కృతి శెట్టి, రాశిఖన్నా వంటి హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి హిట్ ఇచ్చే హీరోయిన్ కావాలి అంటూ కొత్త హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు కూడా ఎంతగానోఎదురుచూడటం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: