హైదరాబాద్ నగరం లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అనేక థియేటర్ లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఏరియాలో ఉన్న థియేటర్ లు అన్నీ కూడా చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న థియేటర్ లే. దానితో ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల అయ్యింది అంటే ఈ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను ఆ సినిమాలు అందుకుంటున్నాయి అనే విషయంపై ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమా నిన్న అనగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 81.61 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి ఈ ఏరియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు 75.87 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో మొదటి రోజు 57 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమా 54.23 లక్షల కలెక్షన్ లతో 4 వ స్థానంలో నిలవగా , కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 50.71 లక్షల కలెక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.