పవర్ స్టార్ పై ఆశలు పెట్టుకున్న శ్రీలీల....!!

murali krishna
శ్రీలీల.. ఒక్క సినిమాతో టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే అగ్ర హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు ఉన్న సీనియర్లందరినీ పక్కకు నెట్టేసి మరీ స్టార్ హీరోయిన్ గా అవతారం ఎత్తింది.హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో సినిమాతోనే టాప్‌ లీగ్‌లోకి వచ్చింది. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌ లాంటి అగ్ర హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఒక్క సినిమాతో వారితో నటించే ఆఫర్ రావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇంత వరకు ఏ హీరోయిన్ కు ఇంతగా ఆఫర్లు రాలేదు.ఏకంగా పది సినిమాల్లో ఆఫర్ కొట్టేసిందంటే మాటలు కాదు. ఒక్క సినిమాతో ఇన్ని ఆఫర్లు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కు కూడా రాలేదు. అయితే శ్రీలీల క్రేజ్ రోజు రోజుకూ పడిపోతూ వస్తోంది. ఎంత ఫాస్ట్ గా స్టార్ గా మారిందో అంతే దారుణంగా ప్లాప్ లు చవి చూస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ ప్లాపే అవుతున్నాయి. రెండో సినిమా అయిన స్కంద తోనే ఈ దారుణమైన ప్లాప్ లు మొదలయ్యాయి. స్కందతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. కానీ ఆ మూవీ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇక దాని తర్వాత వచ్చిన ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ అయితే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియలేదు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా కనీసం ఉనికిని చాటుకోలేక పోయింది. దాంతో శ్రీలీలకు మళ్లీ ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన ఆది కేశవ మూవీ కూడా ఇంతే దారుణంగా ప్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయి ఎటూ కాకుండా పోయింది. సరే ఇవన్నీ ఓకేలే.. మహేశ్ బాబు మూవీ ఉంది కదా అని ఆమె ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం ఎలాగైనా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి.. మళ్లీ ఛాన్సులు వస్తాయిలే అనుకుంది.కానీ ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి. ఎందుకంటే గుంటూరు కారంకు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఆ సినిమా ప్లాప్ అనే టాక్ వస్తోంది. దాంతో శ్రీలీల ఖాతాలో వరుసగా మూడు ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది.కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆశలు మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా హిట్ అయితేనే ఆమెకు కెరీర్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆమెను అంతా ఐరన్ లెగ్ అని ముద్ర వేయడం పక్కా అని అంటున్నారు సినీ విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: