ఆ ఇష్యూపై ఓపెన్ అయిన నాగార్జున..!

shami
కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా ఆదివారం రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా ఏ రోజు రిలీజ్ చేస్తున్నామన్నది కాదు పండుగ హాలీడేస్ ని క్యాష్ చేసుకుంటున్నామా లేదా అన్నది లెక్క కడుతున్నారు. శుక్రవారం మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రాగా.. శనివారం సైంధవ్ వస్తుంది. ఆదివారం నాగార్జున నా సామిరంగ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు మాత్రం సినిమా పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ అనిపించేలా చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రైటర్ ప్రసన్న కుమార్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించడం పై స్పందించారు నాగార్జున. మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ సినిమాను రీమేక్ గా చేయాలనుకున్న తర్వాత ఆ కథను ఎవరు కరెక్ట్ గా చెప్పగలరో వారితో సినిమా చేయాలని నాగార్జున అనుకున్నారట. అయితే ప్రసన్న కుమార్ కొంతమేరకు బాగానే పయత్నించాడు. కానీ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ చెప్పిన నరేషన్ నచ్చడంతో అతనితో సినిమా చేశామని అంటున్నారు నాగార్జున.

రైటర్ ఆ ప్రసన్న కుమార్ సూపర్ ఫాం లో ఉన్నాడు. మరి అలాంటి రైటర్ నరేషన్ కాదని విజయ్ బిన్ని చెప్పింది ఓకే చేశారంటే విజయ్ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నాగార్జున తో పాటుగా ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. ఆషిక రంగనాథ్ మెయిన్ హీరోయిన్ కాగా రుక్సర్ థిల్లాన్ కూడా సినిమాలో నటించింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సినిమా పై నాగ్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. సంక్రాంతికి పోటీలో తనదైన స్టైల్ లో దిగుతున్న నాగార్జున తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: