తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన కొంత కాలం క్రితం కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ హీరో గా రూపొందిన వేద అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ తెలుగు లో విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఇప్పటికే వేద సినిమాతో మంచి గుర్తింపును తెలుగులో సంపాదించుకున్న హర్ష దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో భీమా మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి.
ఇకపోతే ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ విడుదల అయిన కొన్ని వారాలకు ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ తర్వాత కొన్ని వారాలకు స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.