పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శ్రద్ధదాస్..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వరుసగా వివాహాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు.. ఇలాంటి సమయంలోనే చాలామంది హీరోయిన్ల గురించి మ్యారేజ్ గ్యాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అలా టాలీవుడ్ హీరోయిన్ ఆయన శ్రద్ధాదాస్ గురించి కూడా గత వారం నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఈ విషయం పైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో మొదటిసారిగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అల్లు అర్జున్ తదితర హీరోలతో పలు సినిమాలలో నటించింది. ఇప్పటికీ ఏదో ఒక అడపా దడపా సినిమాలలో నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్న శ్రద్ధాదాస్ సినిమాలపరంగా బిజీగానే కనిపిస్తుంది. ఇవి కాదన్నట్లుగా పలు రకాల రియాల్టీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ ఉంటుంది ప్రస్తుతం శ్రద్ధదాసు వయసు 32 సంవత్సరాలు..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక బిజినెస్ మాన్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతోందని రూమర్స్ గత వారం నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం పైన ఎవరు స్పందించకపోవడంతో నిజమేనని అందరూ అనుకున్నారు..కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని స్వయంగా శ్రద్ధ దాస్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తను ఏ బిజినెస్ మాన్ తో కూడా రిలేషన్స్ లో లేనని తెలియజేసింది. దీంతో పెళ్లి పై వస్తున్న వార్తలకు దిమ్మతిరిగే సమాధానాన్ని సైతం చెప్పేసింది శ్రద్ధాదాస్.. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం కాస్త నిరాశ చెందుతున్నారు.. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తున్న శ్రద్ధదాస్ పలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. మరి ఇకపైన ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.