అఫీషియల్ : సైన్ధవ్ హిందీ నాన్ థియేటర్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ తాజాగా సైంధవ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బంధం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి.
 



ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ కేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా యొక్క యొక్క హిందీ నాన్ థియేటర్ హక్కులను "ఆర్ కే డే" స్టూడియో సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమా తెలుగు లో విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత తమ టీవీ ఛానల్ లో మరియు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సైందవ్ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో వెంకటేష్ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో అనేది తెలియాలి అంటే జనవరి 13.వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: