వెంకటేష్ విషయంలో గొడవ పడ్డ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్...!!
అదే విధంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోహిణి నవ్వులు పూయించారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో మొదలయింది. ఆ తర్వాత ఇద్దరూ ఖుష్భూ,మీనా లతో కొంటె వేషాలు వేశారు. మిమ్మల్ని తెలుగు చంటి లో చూడదని చాలా ఆనందంగా అనిపించింది అని సుడిగాలి సుధీర్ మీనాతో అంటే.. మిమ్మల్ని తమిళ చంటిలో చూడడం ఆనందంగా అనిపించింది అని హైపర్ ఆది ఖుష్బూతో అన్నాడు. మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడడానికి చాలా చిరాగ్గా ఉందని ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది.వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాక అసలు రచ్చ మొదలయింది. వెంకటేష్ తన పక్కనే కూర్చోవాలి అని మీనా అంటే లేదు నా పక్కనే కూర్చోవాలి అని ఖుష్భూ అన్నారు. దీనితో ఇద్దరి మధ్య రచ్చ రచ్చ జరిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ జోడి మాది అని మీనా అన్నారు. వెంకీ జర్నీ మొదలింది నాతో అని ఖుష్బూ అన్నారు. స్టార్ అయింది అలాగే మీ కాంబినేషన్ ఎండ్ కూడా అయిపోయింది అంటూ మీనా ఖుష్బూకి కౌంటర్ ఇచ్చారు.
వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే వెంకటేష్ అయోమయంగా ముఖం పెట్టడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత కూడా వెంకటేష్ , ఖుష్బూ, మీనా, హైపర్ ఆది, సుధీర్ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరిద్దరూ వెంకీ వెంకీ అని ఒక్కసారి పిలవండి అని సుధీర్ మీనా, ఖుష్బూతో అన్నారు.అంత ఓవరాక్షన్ వద్దు జస్ట్ వెంకీ అంటే చాలు అని వెంకటేష్ సుధీర్ కి కౌంటర్ ఇచ్చారు.