కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ రద్దు ఆ మూవీకి ప్లస్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలకు ప్రేత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొత్త కథలతో లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను హై ఓల్టేజ్ యాక్షన్ తో నింపేశారు. ఈ సినిమా స్టోరీ బ్రిటీష్ కాలంలో జరుగుతుంది. బ్రిటీష్ వారికి, గిరిజన వర్గానికి చెందిన యువకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా స్టోరీ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. బ్రిటిష్ అధికారులు గిరిజన తండా భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ మైనింగ్ స్టార్ట్ చెయ్యడం ఇంకా హింసాత్మకంగా వారిని ఆ ప్రదేశం నుండి బహిష్కరించడానికి ప్రయత్నించడం చూపించారు. ఇక అప్పుడు అదే వర్గానికి చెందిన ఓ యువకుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఇదీ 'కెప్టెన్ మిల్లర్' స్టోరీ అని తెలుస్తోంది.ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ట్రైలర్ తో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయండం లేదని తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ రద్దు అయ్యిందని సమాచారం తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం సంక్రాంతికి టాలీవుడ్ లో గట్టి పోటీ ఉంది. దాంతో హీరో ధనుష్ థియేటర్స్ సరిగ్గా దొరక్క తెలుగు రిలీజ్ ను ఆపేసినట్టు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్త నిజమే అని తేలిపోయింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో కూడా తెలుగు వర్షన్ ను రిలీజ్ చేయలేదు. దాంతో ధనుష్ తెలుగు వర్షన్ రిలీజ్ ను ఆపేశారని పూర్తిగా అర్ధమవుతుంది. అయితే త్వరలోనే ఈ ను తెలుగులో కూడా రిలీజ్చేస్తారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.ఇక సంక్రాంతికి ఈ సినిమా బదులు శివ కార్తికేయన్ అయాలన్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: