అలాంటి పాత్రలు వస్తే అస్సలు వదులుకోను.. శివాజీ కామెంట్స్ వైరల్?

praveen
తెలుగు వెండితెరపై హీరోగా పరిచయమై ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు శివాజీ. ఏకంగా స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకున్నప్పటికీ.. ఊహించని రీతిలో ఇక ఇండస్ట్రీకి దూరమై పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక చిత్ర పరిశ్రమంలో ఉన్న పోటీని తట్టుకోలేక చివరికి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక అతని కెరియర్ ముగిసి పోయింది అని అందరూ అనుకుంటున్న సమయం  లో ఇటీవలే తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ అనే షోలో ప్రత్యక్షమై అభిమానులు అందరిని కూడా సర్ప్రైజ్ చేశాడు.

 ఇక ఈ కార్యక్రమం లో తనదైన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించి టాప్ 3 కంటెస్టెంట్  గా బయటికి వచ్చాడు అని చెప్పాలి. అయితే బిగ్బాస్ అనే షో ద్వారా మరో సారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ సీనియర్ నటుడు ఇక ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగం గా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు శివాజీ. ఈ క్రమం లోనే ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

 తాను ప్రస్తుతం అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నానని.. ఇక తనకు సరైన అవకాశం వస్తే తప్పకుండా ఇండస్ట్రీ లోకి వస్తాను అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే తాను హీరో గానే ప్రేక్షకుల ముందుకు రావాలి అని కోరుకోను. కథ ప్రాధాన్యత ఉన్నటువంటి విలన్ పాత్రలోనైనా నటించడానికి నేను రెడీ గానే ఉన్నాను అంటూ శివాజీ తెలిపాడు. ఎప్పటికీ రొటీన్ పాత్రలే కాకుండా డిఫరెంట్ రోల్స్ లో నటించాలని ఉంది. అలాంటి పాత్రులు వస్తే అసలు వదులుకోను అంటూ ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు శివాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: