ప్రభాస్ - మారుతీ మూవీ.. స్టోరీ లైన్ లీక్?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల సలార్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ   మూవీ ఏకంగా వసూళ్ల సునామీ సృష్టించింది అని చెప్పాలి. ఇక ప్రభాస్ అభిమానులందరికీ కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది. అయితే ఇక ఇప్పుడు సలార్ మూవీ తర్వాత ప్రభాస్ లైన్ అప్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే అటు ప్రభాస్ తో మారుతి చేయబోయే మూవీపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదల కాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ఈ సినిమాకు సంబంధించి సెట్స్  స్టిల్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఏకంగా సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే మారుతి ప్రభాస్ లాంటి పెద్ద హీరో కోసం ఎలాంటి కథను రెడీ చేసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఈ క్రమంలోనే మారుతి సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరో లీక్ చేయడం కాదు ప్రభాస్ అభిమానుల కోసం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మారుతి సినిమా హారర్ అండ్ కామెడీ జోనర్ లో రాబోతుందట. ఇక ఈ మూవీలో సరికొత్త ప్రభాస్ ని చూడబోతున్నారట అభిమానులు. ఇప్పుడు వరకు అన్ని జోనర్లలో నటించిన ప్రభాస్ హారర్ జోనర్ లో మాత్రం నటించలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే సలార్, ప్రాజెక్టు కే లాంటి సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంటూనే ఇక ఖాలి సమయం దొరికినప్పుడల్లా మారుతీ డైరెక్షన్లోనూ చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. దీంతో ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిందట. ఇక ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: