ఆ హీరో ఒప్పుకుని ఉంటే.. అర్జున్ రెడ్డి మూవీ విజయ్ కి దక్కేది కాదట తెలుసా ?

praveen
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎంతో కష్టపడుతున్న విజయ్ దేవరకొండను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చిన సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్జున్ రెడ్డి సినిమా అని చెబుతూ ఉంటారు. ఒకవేళ అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండకు దక్కకపోయి ఉంటే అతను ఈ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకునే వాడు కాదేమో అనేది అందరి భావన. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఏకంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించింది.

 ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి అని చెప్పాలి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో అటు విజయ్ దేవరకొండ తప్ప ఇంకే హీరో చేసిన అంతలా పాత్రకి ప్రాణం పోసేవాడు కాదేమో.. అని ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ మూవీ కోసం మొదట విజయ్ దేవరకొండను అనుకోలేదట. ఏకంగా ఈ మూవీలో అల్లు అర్జున్ ను హీరోగా పెట్టుకోవాలని అనుకున్నాడట. గతంలో ఒక ఇంటర్వ్యూలు సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. 2011లో అల్లు అర్జున్ రెడ్డి కథను కూడా వినిపించాడట

 నేను అర్జున్ రెడ్డి కథను అల్లు అర్జున్ కి చెప్పాలని అనుకున్నాను. కానీ  అల్లు అర్జున్ కు ఆ సమయంలో సంప్రదించలేకపోయాను. ఇక పలువురు నటీనటులు నిర్మాతలు  వద్దకు వెళ్ళింది. చివరకు నేనే స్వయంగా నిర్మించాలని భావించాను. ఆ తర్వాత ఒక స్నేహితుడు ద్వారా విజయ్ తో పరిచయం ఏర్పడింది. ఇక విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి కథ చెప్పి షూటింగ్ ప్రారంభించాం అంటూ సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. కానీ నా సినిమాలో అల్లు అర్జున్ మొదట హీరోగా కావాలని అనుకున్నాను అంటూ సందీప్ రెడ్డివంగా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: