ఈగల్ సినిమా పోస్ట్ పోన్ తో.. హ్యాట్సాఫ్ రవితేజ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తానికి సంక్రాంతి రేస్ అనేది మోస్ట్ అవైడెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సంక్రాంతికి ఏ సినిమాలు విడుదల చేసిన టాక్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయని దర్శక నిర్మాతలు సైతం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఆ డేట్కే ఎన్నో చిత్రాలు రావాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. మహేష్ హీరోగా నటిస్తున్న గుంటూరు కారం నాగార్జున నటిస్తున్న నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్ రవితేజ ఈగల్ తేజ సజ్జ హనుమాన్ వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదల చేసే విధంగా చిత్ర బృందాలు ప్లాన్ చేశాయి.


అయితే ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ చేయడం అనేది సాధ్యమైన పని కాదని రిలీజ్ చేయాలి అంటే చేశామన్నట్టుగా వదిలేస్తే ఖచ్చితంగా దర్శకనిర్మాతలు నష్టాలలో ఉంటారు. అంతేకాకుండా థియేటర్లు దొరకవు అని చెప్పవచ్చు. దాదాపుగా ఈ సినిమాలు ఒకటి రెండు రోజుల వ్యవధిలోని విడుదల కాబోతున్నాయి అని అందుకే థియేటర్ల అంశం చాలా కీలకమని ఒకప్పుడు సినిమాలు విడుదల అయ్యాయంటే చాలు కనీసం రెండు మూడు వందల రోజులు అయినా ఆడేవి కానీ ఇప్పుడు కేవలం పది రోజులలోపే కలెక్షన్స్ బట్టి సినిమాని తీసేయడం జరుగుతోంది.


ఇలా ఐదు సినిమాలు బరిలో దిగుతున్న సమయంలో తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిలర్ వంటి వారి దృష్టికి వెళ్లడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గమని చాలామంది దర్శక నిర్మాతలు మీటింగ్ పిలిచి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సినీ పరిశ్రమ మేలు కోసం ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే బాగుంటుంది అంటూ వారికి సోలో రిలీజ్ డేట్ ఇస్తామంటూ కూడా తెలియజేశారు. ఇలాంటి సమయంలోనే రవితేజ నటించిన ఈగల్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని మరి వెనక్కి తగ్గడం జరిగింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు కానీ సినీ పరిశ్రమ మేలుకోరే వ్యక్తి రవితేజ కావడంతో ఇలాంటి పని చేసినట్లు తెలుస్తోంది దీంతో సోలోగా ఈ సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఇండస్ట్రీ మేలుకోరే వ్యక్తి మా హీరో అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: