లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోల పక్కన నటించి చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది.
ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలో మళ్లీ ఈ బ్యూటీ తన ఇంట్రెస్ట్ ను తమిళ ఇండస్ట్రీ పై పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం వరుస కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నయనతార కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో కూడా ఫుల్ క్రేజ్ లభించింది.
ఇకపోతే తాజాగా నయన తార "అన్నపూరణి" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" లో ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. ఇలా నయన తార తాజా సినిమా అయిన అన్నపూరణి "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది.