టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా పై ఎన్నో భారీ అంచనాలే ఉన్నాయి.మరో 8 రోజుల్లో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా థియేట్రికల్ రైట్స్‌కు దాదాపుగా రూ. 120 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం తెలుస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్లకు క్లోజ్ అయినట్టు సమాచారం తెలుస్తుంది. ఓ రీజినల్ సినిమాకు ఇది నిజంగా ఓ భారీ రికార్డు.ఈ సినిమాలో ఫేమస్ టాలీవుడ్ స్టార్ నటులు సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇంకా వీరితో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఆ రోజే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం.ఇక ఈ సినిమా USA ప్రీమియర్స్ ప్రీ సేల్స్ అయితే ఇప్పటికే 100K డాలర్స్ దాటాయి. ఇది నిజంగా సూపర్ డూపర్ రికార్డ్ అని చెప్పాలి.మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా వంటి క్లాసిక్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాని హారికా హాసిని బ్యానర్‌పై నిర్మిస్తోంది. హీరోగా మహేష్ బాబుకు ఈ సినిమా 28వ సినిమా. ఊర మాస్ అవతారంలో వింటేజ్ లుక్‌తో కనిపిస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇదో లాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందో లేదో చూడాలి.గుంటూరు కారం బుక్ మై షో ఇంట్రెస్ట్స్ విషయానికి వస్తే 167.4 k ఉంది. హనుమాన్ 168.6k ఉంది.సైందవ్ 62. 8k, ఈగల్ 18.1 k, నా సామిరంగా 39.5 k ఇంట్రెస్ట్స్ ఉన్నాయి.