టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన మాస్ మహారాజ్ రవితేజ ఒకప్పుడు సినిమా ల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకునేవారు. ఆయనకు ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా తనంతటా తానే కష్టపడి పైకి వచ్చారు. ఆయన తాను హీరోగా చేసిన మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకొని ప్రస్తుతం ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన ఇటీవల చేసిన సినిమా టైగర్ నాగేశ్వరావు కొంచం నిరాశ పరచడంతో ఆయన ఆశలన్ని ప్రస్తుతం చేస్తున్న ఈగల్ పై పెట్టుకున్నారు..ఈగల్ మేకర్స్ మరో ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈసారి ట్రయిలర్ వినోదాత్మకంగా ఉంటుందట.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో రవితేజ నటించిన ఈగల్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ చూసిన చాలా మందికి ఇది సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ అని అభిప్రాయపడ్డారు. కాబట్టి, సందేహాలను క్లియర్ చేయడానికి, ఈగిల్ మేకర్స్ ఎంటర్ టైనింగ్ ట్రైలర్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పైన చెప్పినట్లుగా, సినిమా సీరియస్ మోడ్లో వెళుతుందని అందరూ ఊహించారు. రవితేజలోని రెగ్యులర్ కమర్షియల్ యాంగిల్ సినిమాలో మిస్సయిందని భావిస్తున్నారు. వాటన్నింటిపై దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఈ వారాంతంలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈగల్ నుంచి రెండో ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అందులో కాస్త కామెడీ, వినోదం ఉండబోతున్నాయి. సంక్రాంతికి వినోదం కంపల్సరీ. అందుకే డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ చిత్రంలో రవితేజ టైటిల్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధు, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.