పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ
మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారుక్ ఖాన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన
సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కు ఆరోజు పండగనే చెప్పాలి..రీసెంట్ గా షారుఖ్ పఠాన్,
జవాన్ వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు.ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ సినీ కెరీర్లో
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే
మూవీ ఎంతో స్పెషల్.షారుక్ ఖాన్ ,
కాజోల్ జంటగా నటించిన
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీని ముంబైలోని
మరాఠా మందిర్ థియేటర్లో ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు.1995 లో విడుదల అయిన ఈ మూవీని సుమారుగా 28 సంవత్సరాలుగా మరాఠా మందిర్‌లో రోజుకు ఓ షో వేస్తున్నారు. మిగిలిన సమయంలో ఆ టైమ్‌లో విడుదలయ్యే సూపర్ హిట్ మూవీస్ మరియు కొత్త రిలీజ్ సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ షారుక్
మూవీ వస్తే అన్ని షోలు ఆయన సినిమాలే ఆడతాయి.అయితే
షారుఖ్ ఖాన్ రీసెంట్ గా నటించిన డంకీ
సినిమా రిలీజ్‌కు ముందు
మరాఠా మందిర్ థియేటర్లో యానిమల్ మూవీని ప్రదర్శించారు. తర్వాత యానిమల్ తీసేసి డంకీ సినిమాను షోస్‌గా వేశారు. కానీ, సలార్ విడుదలయ్యాక మాత్రం షారుక్ డంకీని కూడా తీసేసి
ప్రభాస్ మూవీని ప్రదర్శించారు. ఎప్పుడూ అధికంగా షారుక్ సినిమాలు ఆడే ఆ థియేటర్లో డంకీని ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించారు.ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా షారుక్ టెరిటరీగా చెప్పుకునే
మరాఠా మందిర్‌లో డంకీ పక్కన పెట్టి
ప్రభాస్ సలార్
మూవీ ప్రదర్శించి
థియేటర్ యాజమాన్యం 28 ఏళ్ల సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. అయితే ఇది
షారుఖ్ ఖాన్ ను అవమానించడం అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు..