రెండో పెళ్లిపై ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్?

praveen
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మీనా ఇక ఇప్పుడు సినిమాల్లో వివిధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మీనా కెరియర్ లో ఇటీవలే ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. ఏకంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త అకాల మరణంతో ఆమె విషాదంలో మునిగిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మీనా భర్త మరణం తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయ్. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ మీనాకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది.

 అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే ఉంది.. రెండో పెళ్లి చేసుకుంటారా అని ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి కాస్త వంకరగా అడిగాడు జర్నలిస్టు. అయితే ఈ ప్రశ్నకు మళ్ళీ మాట్లాడేందుకు అవకాశం లేకుండా గట్టిగానే సమాధానం చెప్పింది హీరోయిన్ మీనా. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకైతే ఇప్పటికి లేదు. ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారా అంటే?  ఎవరి పరిస్థితి వాళ్ళది. నా జీవితంలో నేను ఇదే చేస్తానని అనుకోలేదు. అలా ఎప్పుడూ చేయలేదు. తక్కువ వయసు ఎక్కువ వయసు అని కాదు నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించుకోలేను. నేను కాదు ఎవరూ కూడా ఊహించలేరు.

 ఇక మొదటి నుంచి కూడా నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. పెద్ద హీరోయిన్ అవుతానని అనుకోలేదు. స్టార్ హీరోలతో కలిసి నటిస్తానని ఊహించలేదు. పెళ్లి కూడా అంతే పెళ్లి చేసుకుంటా అని చెప్పలేని ఒంటరిగా ఉండిపోతాను అని చెప్పలేను. ఎందుకంటే నేను నా భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నా కూతురు నాకంటే ముఖ్యం. నా సుఖం నా సంతోషం కాదు.. నా ప్రియారిటి నా కూతురే. నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకోలేను. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ మీనా గట్టిగానే తన రెండో పెళ్లి విషయం చెప్పింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎదురు చూడటమే తప్ప ఇంకేం చేయలేం. నా మైండ్ లో నా కూతురు తప్ప మరో ఆలోచన లేదు అంటూ మీనా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: