వెంకటేష్ నాని ల కన్ఫ్యూజన్ లో త్రివిక్రమ్ !

Seetha Sailaja
2020లో విడుదల అయిన ‘అల వైకుంఠ పురములో’ మూవీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మారుమ్రోగి పోయింది. అయితే ఆతరువాత ఏర్పడిన కరోనా పరిస్థితులు జూనియర్ ఎన్టీఆర్ తో ఆపై అల్లు అర్జున్ తో ప్రకటింప బడ్డ సినిమాలు ముందుకు నడవక పోవడంతో అయోమయంలో పడ్డ త్రివిక్రమ్ ఎట్టకేలకు మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ మొదలుపెట్టడంతో కొంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ సినిమా నిరీక్షణకు ఫలితం దక్కింది.


అయితే ఈసినిమా కథ విషయంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు వ్రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కథ విషయంలో అనేక సార్లు మార్పులు చేర్పులు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈసినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ మహేష్ సూచనలకు ఒత్తిడికి అనేక సార్లు రాజీపడవలసి వచ్చింది అని అంటారు.


ఎట్టకేలకు ఈమూవీ షూటింగ్ ను పూర్తిచేసిన త్రివిక్రమ్ సంక్రాంతి రేస్ లో తన ‘గుంటూరు కారం’ ను పోటీలో నిలబెట్టి ఆమూవీ ఫలితం గురించి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి రేస్ టాప్ హీరోల సినిమాల మధ్య పోటీగా మారడంతో ‘గుంటూరు కారం’ రిజల్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈమూవీ విడుదల తరువాత మళ్ళీ తన సినిమాలకు సంబంధించిన గ్యాప్ రిపీట్ కాకూడదు అన్న ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు అందుబాటులో లేకపోవడంతో వెంకటేష్ తో కానీ లేదంటే నానీతో కానీ ఒక సినిమాను చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయి అన్న కన్ఫ్యూజన త్రివిక్రమ్ మనసులో ఉంది అని కొందరి అభిప్రాయం.  


దీనికికారణం త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నప్పటికీ ప్రస్తుతం నాని చేతిలో ఉన్న రెండు మూవీ ప్రాజెక్ట్స్ పూర్తి అయితే కానీ త్రివిక్రమ్ నానీల ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే ఆస్కారమ్ లేదు అని అంటున్నారు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే లేటెస్ట్ గా వెంకీ మొదలు పెట్టిన అతడి 75వ సినిమా పూర్తి అయిన తారువాత మాత్రమే త్రివిక్రమ్ ఛాన్స్ వస్తుంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: